Friday, February 6, 2026

మడుమూరు రాందాస్ ను సన్మానించిన స్కూలు యాజమాన్యం

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబిసి మోర్చా కోశాధికారిగా ములకలచెరువు మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల అధినేత మడుమూరు రాందాస్ ఎంపికయ్యారు. రాష్ట్ర ఓబిసి మోర్చా అధ్యక్షులు గోపి శ్రీనివాస్ రంగల ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 1992 వ సంవత్సరం నుండి జన సందేశ్ లో పనిచేస్తూ, బిజెపి పార్టీ కార్యకర్తగా పార్టీకి సేవలందించేవాడు.  ఇటీవల కాలంలో తిరుపతిలో జరిగిన ధన్వంతరి జయంతి కార్యక్రమంలో నాయి బ్రాహ్మణులను గుర్తించిన బిజెపి పార్టీ, పార్టీకి సేవలందిస్తున్న విద్యావంతుడు నాయి బ్రాహ్మణులకు చెందిన రాందాస్ కు ఈ పదవిని కట్టబెట్టారు. ఈ సందర్భంగా మంగళవారం విలేకరుల సమావేశంలో నూతనంగా ఎంపికైన బిజెపి రాష్ట్ర ఓబిసి మోర్చా కోశాధికారి మడుమూరు రాందాస్ మాట్లాడుతూ పార్టీకి చేసిన సేవలను గుర్తించి తనకు కీలకమైన ఈ పదవిని కట్టబెట్టిన రాష్ట్ర ఓబిసి మోర్చా అధ్యక్షులు గోపి శ్రీనివాస్ రంగాలకు, పార్టీ అధినేతలకు, పార్టీ నాయకులకు,కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి పార్టీ తన పై పెట్టిన బాధ్యతను నెరవేర్చి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. బిజెపి పార్టీ ఓబిసి మోర్చా కోశాధికారిగా ఎంపికైన రాందాస్ ను తంబళ్లపల్లి, మదనపల్లి నియోజకవర్గాలకు చెందిన కూటమి నాయకులు, ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు, మండలంలోని పలువురు అభిమానులు దుశాలవాళతో పూలమాలలు వేసి సన్మానించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular