Wednesday, February 4, 2026

ఘనంగా మంత్రి లోకేష్ పుట్టినరోజు

ఆంధ్రసమాచార్, పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురం
తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ,విద్యా మరియు మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పిఠాపురం టౌన్ లో,పార్టీ కార్యాలయం నుండి ఉప్పాడ బస్టాండ్ వరకు బైక్ ర్యాలీగా వెళ్ళి, భారీకేక్ కట్ చేసి, పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగు తమ్ముళ్లకు చెల్లెమ్మలకు పార్టీ సభ్యత్వాలు నమోదు చేయిస్తూ వారికి ఉచిత ఇన్సూరెన్స్ ను కల్పించిన నాయకుడు లోకేష్ అని పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని లోకేష్ నీ ఉన్నత స్థానంలోని నిలబెట్టాలని ప్రతి తెలుగు తమ్ముడు కోరుకుంటున్నారని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular