Wednesday, February 4, 2026

పెదపళ్ళలో కోలాహలంగా మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు*

ఆంధ్రసమాచార్ ఆలమూరు : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం పెదపల్లలో పెదపళ్ళలో కోలాహలంగా మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేష్ ఎంతగానో కృషి చేస్తున్నారని పెదపళ్ళ తెలుగుదేశం నాయకులు అన్నారు. శుక్రవారం మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్బంగా గ్రామ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. యువ గళం పాదయాత్రతో తన సత్తా చాటడంతో పాటు, తెలుగుదేశం కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నారన్నారు. ఐటీ మంత్రిగా రాష్ట్రానికి గూగుల్ తీసుకురావడంతో ఆయన ఘనత ప్రపంచానికి తెలిసిందన్నారు. ప్రత్యర్థుల హేళనలు, విమర్శలను ధీటుగా ఎదుర్కొని తనను తాను ప్రజా నాయకునిగా నారా లోకేష్ మలచుకున్నారని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు లోకేష్ సాధిస్తారని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular