

అడ్డతీగల ( ఆంధ్రసమాచార్ )అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం రాయపల్లి పంచాయితీలో అంగరంగ వైభవంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలకు. రంపచోడవరం నియోజవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీమతి నాగులపల్లి ధనలక్ష్మి మరియు MLC అనంత్ ఉదయ భాస్కర్ వేడుకలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్. శ్రీమతి నాగులపల్లి ధనలక్ష్మి కి గ్రామ సర్పంచి వైస్ సర్పంచి వైయస్సార్ కార్యకర్తలు, యువత, మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలకగా మరోక కార్యకర్త టీ మహేష్ తన భుజాల మీద వేసుకొని స్వాగతం పలికాడు అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకొని వృద్ధులకు దుప్పట్లు పంచారు ఈ కార్యక్రమంలో అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఈ కార్యక్రమానికి కార్యకర్తలు అభిమానులు యువతలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

