
రావులపాలెం ( ఆంధ్ర సమాచార్) జనవరి 25న డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మాదిగల ఆత్మీయ కలయిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంద కృష్ణ మాదిగ రాను అన్నారు డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎమ్మార్పీఎస్ మరియు ఎమ్మెస్పి మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబోయో మాదిగల ఆత్మీయ కలయిక సమయం లేనందున 2026 జనవరి 25న పార్టీలకు అతీతంగా భారీ స్థాయిలో నిర్వహించబోతున్నట్లు ఎమ్మార్పీఎస్,ఎమ్మెస్పి , ఎం ఈ ఎఫ్ మరియు అనుబంధ సంఘాల నాయకులు తెలియజేశారు. దీనిపై ఎం.ఆర్.పి.ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మర రాఘవ మాదిగ మాట్లాడుతూ జనవరి 25 న నిర్వహించే మాదిగల ఆత్మీయ కలయికకు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు ముఖ్య అతిథిగా విచ్చేయుచున్నారని దీనికి వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న మాదిగ జాతి ప్రజా ప్రతినిధులు అందరిని కలిసి ఆహ్వానించబోతున్నామని తెలియజేశారు. ఈ యొక్క సమావేశానికి భారీ స్థాయిలో మాదిగ ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చానిచ్చారు. ఈ సమావేశం లో ఎం.ఎస్.పి జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం యాకోబు మాదిగ, కొత్తపేట నియోజకవర్గ ఇంచార్జ్ కాపా నాగరాజు, ఎం. ఎస్.పి ఆత్రేయపురం మండల సీనియర్ నాయకులు ముప్పిడి రాజు , ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కొడమంచిలి చిరంజీవి , రాచర్ల అరుణ్ , ఆత్రేయపురం మండల అధ్యక్షుడు లాకరపు చంద్ర శేఖర్, పోసిపోయిన రాజు, ఆత్రేయపురం మండల యువసేన అధ్యక్షుడు లంకా ప్రేమ్ కుమార్, యార్లగడ్డ సంజీవ్ కుమార్..
తెలుగు దేశం పార్టీ రాష్ట్ర హెచ్.ఆర్.డి సభ్యులు నేదునూరి వీర్రాజు, రావులపాలెం మండల ఎస్.సి సెల్ అధ్యక్షుడు యార్లగడ్డ మమ్ము , జనసేన పార్టీ నాయకులు యార్లగడ్డ కిషోర్, సిర్రా నాగరాజు పాల్గొన్నారు.

