Friday, February 6, 2026

మానవ హక్కులు, రంపచోడవరం చైర్మన్ గా రాయిని రమేష్ నాయుడు

ఎటపాక (ఆంధ్ర సమాచార్)ప్రతినిధి: బి&జి హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ చైర్మన్ గా ఎటపాక మండలానికి చెందిన రాయిని రమేష్ నాయుడుని సంస్థ ఫౌండర్ మరియు చైర్మన్ బయ్యపునేని వెంకటేశ్వర్లు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.ఈ సందర్బంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ…నాపై నమ్మకంతో సంస్థలో చేయడానికి అవకాశం కల్పించిన సంస్థ చైర్మన్ కు మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మానవ సమాజంలో హక్కులు లేని వ్యక్తి బానిసతో సమానమని, హక్కుల భావజాలం ప్రతి పౌరుడికి భద్రత,సమానత్వం,గౌరవం కల్పించే ముఖ్యమైన ఆయుధమని పేర్కొన్నారు.వివక్ష,అన్యాయం, అణచివేతల నుండి బయటపడే మార్గం మానవ హక్కుల పరిరక్షణతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ జాతి,మతం,వర్ణం, లింగం,సామాజిక స్థితి వంటి ఏ ఆధారంపై కూడా వివక్షకు గురికాకుండా సమాన అవకాశాలు పొందాలని కోరారు.సమాన హక్కులు ప్రతి వ్యక్తి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం మాత్రమే కాదు,సమాజం మొత్తం అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు పునాది వేస్తాయని రమేష్ నాయుడు అభిప్రాయపడ్డారు.మానవ హక్కుల ఉల్లంఘనలను అడ్డుకోవడం,అవినీతి వ్యతిరేక చర్యలను బలోపేతం చేయడం, బాధితులకు న్యాయం అందించడం వంటి అంశాలను బి&బి హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ప్రాధాన్యంగా తీసుకుని పనిచేస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు హక్కుల అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో చైతన్యం పెంచేందుకు సంస్థ కృషి చేస్తానని,అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular