

ములకలచెరువు, ఆంధ్ర సమాచార్ ప్రతినిధి : తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువు మండలం ఎస్టియు మండల అధ్యక్షులుగా ఖాదరవల్లి, మండల ప్రధాన కార్యదర్శిగా జయరాంరెడ్డిలు ఎంపికయ్యారు. బుధవారం మొలకలచెరువు మండల కేంద్రంలోని ఎస్టీయూ కార్యాలయంలో ఎస్ టి యు మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల కమిటీ ఎంపిక నిర్వహించారు. వీరితోపాటు ఆర్థిక కార్యదర్శిగా రహంతుల్లా , గౌరవ అధ్యక్షులు గా కట్టా రమణప్ప, గౌరవ సలహాదారులు గా శంకరప్ప ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మండల ఎస్ టి యు నూతన అధ్యక్షుడు ఖాదరవల్లి ప్రధాన కార్యదర్శి జయరాం రెడ్డి లు మాట్లాడుతూ మండలంలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశములో జిల్లా ఉపాధ్యక్షులు అమరనాథ రెడ్డి, రాజారెడ్డి, శ్రీరాములు , కృష్ణా రెడ్డి, నౌషాద్ ,మల్లికార్జున భాస్కర్ రెడ్డి ,రామాంజులు,ఈశ్వరయ్య,శ్రీధర్ పాల్గున్నారు.
వీరి ఎంపిక పట్ల ములకలచెరువు మండలంలోని ఎస్టియు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

