
పరవాడ: ఆంధ్ర సమాచార్ : వెన్నెలపాలెం గ్రామ పంచాయతి హనుమాన్ కాలనీ లో 20,000 లీటర్ల కెపాసిటీవాటర్ ట్యాంకు శంకుస్థాపన కార్యక్రమం పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండల ఇంచార్జి పంచకర్ల ప్రసాద్ చేతులమీదుగా జరిగింది. NTPC యాజమాన్యంతో అభివృద్ధి కార్యక్రమాల కోసమై చర్చించి, ఈ వాటర్ ట్యాంకు కొరకు నిధులు మంజూరు చేయించినందుకు గ్రామ సర్పంచ్ వెన్నెల అప్పారావు ని పంచకర్ల ప్రసాద్ నీ అభినందించి, సాలువ తో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వై సి పి మండల ఉపాధ్యక్షులు పైలా సత్యనారాయణ గారు (బొబ్బిలి), పరవాడ సర్పంచ్ సిరపురపు అప్పలనాయుడు, జనసేన పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ బుగిడి రామ గోవింద రావు, జేనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు వెన్నెల నర్సింగరావు, గ్రామ కమిటీ అధ్యక్షులు R కళ్యాణ్, రెడ్డి శ్రీను, కటారి నూకరాజు, బండారు నాయుడు, పైలా సన్యాసినాయుడు, కటారి నాయుడు, మాజీ వైస్ ప్రెసిడెంట్ వెన్నెల అయ్యబాబు, పైల సన్యాసిరావు (గబాలు), పైల రేగారావు, వెన్నెల శశి, వెన్నెల సూరిబాబు, మండల మహిళా అధ్యక్షురాలు పైలా వరలక్ష్మీ, గొంప మారునాయుడు పాల్గొనడం జరిగింది.
మా వెన్నెలపాలెం గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న పెందుర్తి MLA పంచకర్ల రమేష్ బాబు గ్రామ సర్పంచ్ వెన్నెల అప్పారావు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది.

