ములకలచెరువు, ఆంధ్రసమాచార్ ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పోకల వంశీ నాగేంద్ర మాధవ్ ను బుధవారం బిజెపి రాష్ట్ర ఓబిసి మోర్చా కోశాధికారి మడుమూరు రామదాసు మర్యాదపూర్వకంగా కలిశారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఈనెల 14వ తేదీ బిజెపి పార్టీ సీనియర్ నాయకులు, దివంగత మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయి విగ్రహ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షుడు పోకల వంశీ నాగేంద్ర మాధవ్ బుధవారం ధర్మవరంకు వచ్చారు. అనంతరం కదిరి నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించిన ఆయనను కదిరి అతిథి గృహంలో బిజెపి రాష్ట్ర ఓబిసి మోర్చా కోశాధికారి మడుమూరు రామాదాసు పోకల వంశీ నాగేంద్ర మాధవ్ ను దుశ్యాలవతో పూలమాలవేసి సన్మానించారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు కలసికట్టుగా పనిచేసి పార్టీ క్యాడర్ ను బలోపితం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు రామాదాసు కు తెలిపారు. పార్టీ కోసం కష్టపడే నాయకులకు పార్టీ తగిన గుర్తింపు నుంచి పదవులను కట్టబెడుతున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు తెలిపారు.


