
ఎటపాక,డిసెంబర్ 11 (ఆంధ్ర సమాచారం) ప్రతినిధి : అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం లో సీసీఐ కేంద్రం ద్వారా పత్తి (కాటన్,) కొనుగోలు చేయాలని వైఎస్ఆర్సిపి ఎటపాక మండల అధ్యక్షుడు ఆకుల వెంకట రామారావు (పెద్దోడు) డిమాండ్ చేయటం జరిగింది.రైతులు పడుతున్న బాధలు దృష్ట్యా ఈ సంవత్సరం సీజన్లో తుఫానుల ప్రభావం వల్ల రైతులకు పత్తి ఎకరానికి సుమారు మూడు నాలుగు క్వింటాళ్లు దిగుబడి రావటం జరిగింది.రైతులు భారీగా నష్టపోయారు ఈ పంటని ఎటపాక మండలంలో దళారుల చేతుల్లో రైతులు మోసపోతున్నారు.కానీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు.అందువలన సిసిఐ కేంద్రం ద్వారా ప్రతి కొనుగోలు చేయాలని ఒక సమావేశంలో డిమాండ్ చేశారు.నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

