ఆంధ్ర సమాచార్ డెస్క్ : తారామ రాజు జిల్లాలో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారని తెలిసి చింతిస్తున్నాను. యాత్రికులతో కూడిన బస్సు చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడి పోయిందని అధికారుల ద్వారా అందిన సమాచారం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతితెలియచేస్తున్నాను. ఈ దుర్ఘటనలో 22 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించడమైనది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుంది

