Friday, February 6, 2026

కేశవరంలో 262 మందికి ఉచిత కంటి పరీక్షలు

మండపేట ( ఆంధ్ర సమాచార్ ) ‘పీ4’ (P4) కార్యక్రమం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కేశవరం గ్రామంలో ఆదివారం ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ (LVPEI) ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు  ముఖ్యఅతిథిగా విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో గ్రామానికి చెందిన సుమారు 262 మంది ప్రజలు వినియోగించుకున్నారు. అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు కర్రి తాతారావు, ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్, కంటిపూడి శ్రీనివాస్, మండల తెలుగు యువత నాయకులు ఉండమట్ల సురేష్, ఉండమట్ల శ్రీనివాసు, కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular