Friday, February 6, 2026

సిరిగిందలపాడు లో రామ కృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల

రామ కృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్య శాల రాజమండ్రీ వారి అధ్వర్యంలో  రంపచోడవరం, సిరిగిందలపాడు లో ది-14.12.2025ఆదివారం ప్రత్యేక  వైద్య శిభిరం నిర్వహించినట్లు రామ కృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయనందజీ మహారాజ్ తెలియచేసినారు. ఈ ప్రత్యేక వైద్య శిభిరం లో సుమారు 400 మంది రోగులకు వైద్య సేవలు అందించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయనందజీ మహారాజ్ టెలియచేసినారు ఈ వైద్య శిభిరం లో డా”జి.వి.రామారావు గారు, డా”కస్తూరి సుబ్రమణ్యం గారు, ,  ,డా”టి.వి.సుబ్బారావు గారు. డా, పోతుల రామారావు గారు, డా, మణికంఠ, డా, శ్రుతి వైద్య సేవలు అందించారు.  జి.యస్. ఎల్.జనరల్ ఆసుపత్రి, రాజానగరం నుండి ప్రత్యెక వైద్య నిపుణులు చెవి. ముక్కు గొంతు, చర్మ వ్యాధులు, ఎముకలు కీళ్ళు, స్త్రీల వ్యాధులు, మరియు జనరల్ వ్యాధులకు వైద్య సేవలు అందించారు. ఈ వైద్య శిభిరం లో పాల్గొన్న రోగులకు 89మందికి రక్తపరీక్షలు, 09మందికి థైరాయిడ్ పరీక్షలు , 12గురికి ఇ.సి.జి లు,14మందికి ఎక్స్ రే, లు , 07గురికి ఫిజియథెరపీ లు చేసినట్లు స్వామీజి తెలిపినారు. మరియు వేమాగిరి పరమహంస యోగానంద కంటి ఆసుపత్రి వారిచే కంటి వైద్య శిబిరం నిర్వహించి  97మందికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరము అయిన వారికి 16మందికి కళ్లజోళ్లు . 10మందిని కంటి ఆపరేషన్లు నిమిత్తం వెమగిరి పరమహంస యోగానంద కంటి ఆసుపత్రి కి తరలించినారు. ఈ వైద్య  శిభీరాన్ని రామక్రిష్ణ మిషన్  ధర్మ వైద్యశాల  ఇంఛార్జి స్వామి లోకమయనంద మహారాజ్ పరివేక్షించినారు ఈ వైద్య శిబిరాన్ని  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డు తెగల (S.T) కమిషన్ ఛైర్మన్ శ్రీ సోళ్ళ బొజ్జి రెడ్డి గారు  సందర్చించి రామకృష్ణ మిషన్  గత 4 దశాబ్దాలుగా ఏజెన్సీ లో చేస్తున్న సేవలు అద్భుతమని ప్రశంచించినారు.  ఈ వైద్య శిబిరంలో Ex-zptc యర్రా వెంకట రామ కృష్ణ , ఆడబాల బాపి రాజు, నండూరి రాంబాబు క్యాంప్ కో – ఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస్, వాలంటీర్స్ ఎల్. జి.బి.భగిరథ రాజు.  మంగిరెడ్డి, జీరాక్స్ రాము, చంద్రరావు,రాజా మల్లేష్, వై వి సత్యనారాయణ, రాఘవరావు  మరియు సిబ్బంది పాల్గొన్నారు,  రోగులకు, సహాయకులు కు అన్నదానం నిర్వహించినట్లు స్వామీజీ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular