Friday, February 6, 2026

ఘనంగా జగన్మోహన్ రెడ్డి  జన్మదిన వేడుకలు

ములకలచెరువు ( ఆంధ్రసమాచార్ ) ప్రతినిధి : మాజీ ముఖ్యమంత్రి   జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవమును మండలంలోని వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ములకలచెరువు మండలంలో    జడ్పిటిసి మోహన్ రెడ్డి మండల కన్వీనర్ మాధవరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జగనన్న జన్మదిన వేడుకలు పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని మూడు రోడ్ల కూడలిలో జై జగన్ అంటూ నినాదాలతో బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు.  ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ప్రజల జీవితాల్లో ఆయన తీసుకొచ్చిన మార్పులను గుర్తు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్, పేదలకు ఇల్లు,అమ్మ ఒడి,ఆసరా, పెన్షన్లు,రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, తదితర పథకాలతో  ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి స్థానం పదిలం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు విష్ణువర్ధనరెడ్డి,సునీత సుదర్శనరెడ్డి,రాంబాబు నాయుడు, చక్రపాణి నాయుడు,రెడ్డెప్ప,ఎంపీటీసీ అయిషా చాంద్ బాషా,రేష్మా రఫీ,నియోజకవర్గం వడ్డెర సంగం నాయకులు శ్రీనివాసులు,నాయకులు లవకుమార్ రెడ్డి,మల్లికార్జున రెడ్డి,డాక్టర్ విశ్వనాధ్, క్రిష్ణారెడ్డి, యాసిన్, బిఎఫ్ఎన్ ట్రావెల్స్ రాజారెడ్డి,ఇంద్ర ట్రావెల్స్ ఈశ్వర,బండ్రేవు నరసింహారెడ్డి,ప్రత్యేక ఆహ్వానితుడు మంత్రి సిద్ధారెడ్డి,మాజీ సింగిల్విండో చైర్మన్ సదాశివప్ప, అన్సర్ భాష,కిషోర్, విష్ణు, సిహెచ్ నాగేంద్ర, సోషల్ మీడియా కన్వీనర్, రెడ్డి మౌలాలి,  ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular