Friday, February 6, 2026

ములకలచెరువు మండలంలో చిన్నారులకు పోలియో చుక్కలు

ములకలచెరువు ( ఆంధ్రసమాచార్ )ప్రతినిధి : ములకలచెరువు మండలంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని డాక్టర్ రేష్మ బేగం, డాక్టర్ లోకేష్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మరియు ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్ల సహాయంతో మండలంలో 36 పోలియో బూతులను ఏర్పాటు చేసి 97.2 శాతం సాధించారు. మండలంలో మొత్తం 4758 మంది చిన్న పిల్లలకు పోలియో వ్యాక్సిన్ వేయవలసి ఉండగా 4617 మంది చిన్న పిల్లలకు పోలియో వ్యాక్సిన్ వేయడం జరిగిందని డాక్టర్ రేష్మ తెలిపారు. సోంపల్లి ప్రాథమిక పాఠశాలలో మాజీ సర్పంచ్ ఎర్రగుడి సురేష్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కె.వి.రమణ లు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెంకట సిద్దయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు పాల రాము, ఎగవేంటి శంకర రఫీ, షఫీ, అమానుల్లా, బయన్న, గోవిందు,మల్లికార్జున,  లతీఫ్ సాబ్, మునుస్వామి, గౌసియా, సున్ని,అంజనప్ప, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular